హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సీఐగా పని చేస్తున్న నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తుపాకీతో బెదిరించి కిడ్నాప్, అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే తెలంగాణ పోలీసుశాఖ నియామక నిబంధనలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2) బి సర్వీస్ రిమూవల్ ప్రకారం ఎటువంటి విచారణ లేకుండా నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఆఫీస్ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై వచ్చిన నేరారోపణలను విచారణ జరపడం సాధ్యం కాదని.. విచారణ నిర్వహిస్తే సాక్షులు, బాధితులను నాగేశ్వరరావు బెదిరింపులకు గురి చేసే అవకాశం ఉందని పోలీసుశాఖ ఉత్తర్వుల్లో వివరించింది. మరోవైపు, విచారణకు చాలా సమయం పడుతుందని, ఈ క్రమంలో నాగేశ్వరరావు బాధితులను, సాక్షులను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ జరపకుండా సర్వీసు నుంచి తొలగించడమే సరైన శిక్ష అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
అత్యాచారం కేసులో సీఐ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగింపు
-
Read more RELATEDRecommended to you
Bengaluru | ప్రాణం తీసిన పందెం.. బాంబుపై కూర్చున్న వ్యక్తి..
దీపావళి రోజున స్నేహితులతో కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణం బలితీసుకుంది....
Bomb Threats | ఆగని బాంబు బెదిరింపులు.. 14 రోజుల్లో ఎన్నంటే..
విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులకు(Bomb Threats) కేంద్రం సైతం అడ్డుకట్టవేయలేకుంది. వీటిని...
సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు..
Cyber Criminal Gang | సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం...
Latest news
Must read
Ramamurthy Naidu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం
తమ్ముడు నారా రోహిత్(Nara Rohit) తండ్రి నారా రామ్మూర్తి నాయుడు(Ramamurthy Naidu)...
Glowing Skin | చలికాలంలో మెరిసిపోయే చర్మం కోసం టిప్స్
Glowing Skin | చలికాలంలో డ్రై స్కిన్ వేధిస్తుంటుంది. దీనికి తోడు...