Flash News : వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్

Hyderabad police shock to motorists

0
96

హైదరాబాద్‌ మెట్రో సిటిలో ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి తిరిగే వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్లు వేస్తారు . ఫైన్లు ఈ చలానా రూపంలో వాహనాల నెంబర్, డైవింగ్ లైసెన్స్ నెంబర్ల పై నమోదు చేస్తారు. అయితే వాటిని చెల్లించకుండా రోడ్ల పై తిరుగుతున్న వాహనదారులను ట్రాఫిక్‌ పోలీసులు వదిలిపెట్టడం లేదు.

ఈ చలాన్లే కదా ఎప్పుడైనా కట్టుకోవచ్చని భావించిన వాహనదారులకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. సోమవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కమిషరేట్‌ పరిధిలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

ఈ చలాన్లు ఒకటికి మించి పెండింగ్‌ ఉన్న వాహనదారులను గుర్తించి అక్కడికక్కడే చలాన్లు కట్టించుకున్నారు. కట్టలేని వారి వాహనాలను సీజ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి పదుల సంఖ్యలో వాహనాలను సీజ్‌ చేశారు.