హైదరాబాద్ లో విషాదం..ఉన్నతాధికారుల వేధింపులకు యువతీ బలి

0
127

హైదరాబాద్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దువ్వసి సరస్వతి అనే యువతీ నిమ్స్ రేడియాలజి విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఆనందంగా జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో యువతీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిమ్స్ లో రేడియాలజి విభాగంలో పని చేసే వాళ్ళను విచారించారు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో ఆ విభాగములోని ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మా కూతురు ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాంతో ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.