ఆ పత్రాలు ఇవ్వకుంటే మొహంపై దగ్గుతా : కరోనా పేరుతో మాజీ భార్య వేధింపులు

0
107

కోవిడ్ ఒకవైపు విశ్వరూపం దాలుస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నది. కోవిడ్ పేరుతోకార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల ఆస్తులు కొల్లగొడుతున్నాయి. తాజాగా కోవిడ్ పేరు చెప్పుకుని ఓ మహిళ ఏకంగా తన మాజీ భర్తను వేధింపులకు గురిచేసింది. తన డిమాండ్ నెరవేర్చకపోతే మొహం దగ్గుతానంటూ బెదిరించింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాలు చదవండి.

‘‘నాకు ఆ ఆస్తి పత్రాలు ఇవ్వు… లేదంటే నీ మొహం మీద దగ్గుతా… అసలే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది… ఆస్తి పత్రాలు ఇవ్వకపోతే కోవిడ్ అంటిస్తా… తర్వాత నీ ఇస్టం’’ అంటూ ఒక మహిళ  మాజీ భర్తను బెదిరించింది. ఈ సంఘటన జూబ్లిహిల్స్ లోని నందగిరి హిల్స్ లో జరిగింది.

నందగిరి హిల్స్ లో 70 ఏళ్ల వయసున్న సంజీవరెడ్డి వ్యాపారం చేస్తుంటాడు. ఆయన గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వయసు ఇప్పుడు 38 ఏళ్లు. వారికి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంజీవ్ రెడ్డి గతంలో ప్రశాసన్ నగర్ లో ఆ మహళ పేరుమీద ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ తరర్వాత ఆ మహిళ సంజీవరెడ్డిని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సంజీవరెడ్డి, తన 17 ఏళ్ల కొడుకుతో కలిసి నందగిరి హిల్స్ లో నివశిస్తున్నారు.

అయితే సదరు మహిళ ప్రశాసన్ నగర్ లో కొనుగోలు చేసిన ఇంటి పత్రాల కోసం మే 31వ తేదీన సంజీవ రెడ్డి ఇంట్లోకి అక్రమంగా జొరబడింది. తన పేరు మీదున్న ఆస్తి పత్రాలు ఇవ్వాలని బెదిరించింది. సంజీవరెడ్డిని దుర్భాషలాడింది. అంతేకాదు ఆస్తి పత్రాలు ఇవ్వకపోతే తనకు కోవిడ్ పాజిటీవ్ ఉందని… మొహం మీద దగ్గి అంటించి చంపుతానని బెదిరించింది. ముసలి వయసులో ఉన్నందున దగ్గి కరనా అంటిస్తే ఆసుపత్రికి వెళ్లినా బతికే చాన్స్ లేదని భయభ్రాంతులకు గురిచేసింది.

దీంతో ఆమె వేధింపులు తట్టుకోలేక సంజీవరెడ్డి జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఆ మహిళపై ఐపిసి సెక్షన్ 447, 341, 506,  సెక్షన్ 3 ఎపిడమిక్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

ఈ ఘటన హైదరాబాద్ లో హాట్ టాపిక్ అయింది. ఈ కేసును పోలీసులు ఎలా ఛేదిస్తారో చూడాలి.