శ్రీ‌శైలంలో హైద‌రాబాద్‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య

Hyderabad young woman commits suicide in Srisailam

0
82

హైదరాబాద్ కు చెందిన యువతి శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌కు చెందిన అభిలాష్‌రెడ్డి, మౌనిక భార్యభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. అయితే వివాహం జరిగినప్పటి నుంచి భర్త అభిలాష్‌రెడ్డి భార్య మౌనికను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు.

దీంతో విసుగు చెందిన మౌనిక భర్త అభిలాష్‌పై రెండు నెలల క్రితం సరూర్‌ నగర్‌ ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ మహిళ పోలీస్ స్టేషన్ లో ఇద్దరికి కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. అయితే నిన్న చివరి సారి అభిలాష్‌తో మాట్లాడిన మౌనిక శ్రీశైలం వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.