పాము కరిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కొందరు పాము కరిచినా నిర్లక్ష్యం చేస్తారు దీని వల్ల అపస్మారక స్దితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ దారుణం జరిగింది. బిహార్లోని నలంద జిల్లాలో ఓ వృద్ధుడిని పాము కరిచింది. అయితే కోపంతో ఊగిపోయిన అతడు పామును కొరికి చంపాడు.
రుమామహ అనే వృద్ధుడు నలంద ప్రాంతంలోని మాధోపూర్ దేహ్ గ్రామ నివాసి. అతన్ని రాత్రి పాము కరిచింది. ఈ సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడు. ఆ పాముని చేత్తో పట్టుకుని కొరికి చంపాడు. చివరకు ఆ పాము అతని నోటిలో కరవడంతో అతనికి కూడా గాయాలు అయ్యాయి.
పాముని చంపిన తర్వాత దానిని ఇంటి సమీపంలోని చెట్టుకు కట్టి వేలాడదీశాడు. జనం అంతా ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు అయినా అది చిన్న పాము నాకేం అవ్వదు. చిన్నపాములో విషం ఉండదు అన్నాడు. అలా రాత్రి పడుకున్నాడు ఉదయానికి అతను నిద్ర లేవలేదు. వెంటనే అతన్ని వైద్యుల దగ్గరకు తీసుకువెళితే అతను చనిపోయాడు అని తేల్చారు. ఏమీ కాదు అనే నిర్లక్ష్యం చివరకు అతని ప్రాణం పోయేలా చేసింది.