ఏపీలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..ప్రేమను తిరస్కరించారని కత్తితో దాడి

0
68

ఏపీలో ఓ ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం అంబేద్కర్ కాలానికి చెందిన నాగదేసి జోయల్ కత్తితో హల్ చల్ చేశాడు. అంతేకాదు నలుగురు మహిళలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. దీనితో వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో బల్లారపు నిఖిత (22), బల్లారపు అఖిల (21), బల్లారపు రాజరాజేశ్వరి, బల్లారపు నగరాజ్యం (40) ఉన్నారు. తన ప్రేమను తిరస్కరించారని యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. గాయపడ్డవారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.