నల్గొండలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ కళాశాల విద్యార్థినిపై యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న రోహిత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. డిగ్రీ చదువుతున్న యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడి చేసిన యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.