తెలంగాణలో కలకలం..హత్యా లేక నరబలా?

0
86

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్-నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి పై మెట్టు మహంకాళి దేవాలయం ఉంది. ఆ ఆలయ దేవత విగ్రహం కాళ్ళ వద్ద దుండగులు మొండెం లేని తలను తీసుకువచ్చి..వదిలినట్లు తెలుస్తుంది. తలను గుడి వద్ద వదలడంతో.. ఇది నరబలా అనే అనుమాన్ని స్థానికులు వ్యక్తపరిచారు. తల ఎవరిది? ఎవరు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.