బ్రేకింగ్ న్యూస్ : రాంకీ సంస్థలపై ఇన్ కం ట్యాక్స్ రైడ్స్

0
133

రాంకీ గ్రూప్ సంస్థలపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాంకీ సంస్థల అధిపతి అయోధ్య రామిరెడ్డి నివాసంలో, కార్యాలయాల్లో ఐటి అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు జరుపుతున్నారు.

ప్రస్తుతం అయోధ్య రామిరెడ్డి వైసిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన సంస్థలపై ఐటి దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రాంకీ సంస్థ తెలుగు నేల మీద అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. అయితే ఈ సంస్థపై ఇటీవల కొన్ని టివిఛానెళ్లు భూకబ్జా ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారం చేశాయి. పెద్దమొత్తంలో భూమిని కబ్జా చేశారని వార్తా కథనాలు ప్రసారం చేశాయి.

ఈ నేపథ్యంలో ఆయన సంస్థలపై ఐటి దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వైసిపి ఎంపీపై దాడులు జరగడం ఆంధ్రాలో సైతం చర్చనీయాంశమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.