ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీరి కామానికి ముక్కుపచ్చలారని చిన్నారులు బలి అవుతున్నారు. ఇలా రోజు ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో అమానవీయ ఘటన జరిగింది. ఓ ఐదేళ్ల చిన్నారిపై 67 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈనెల 21న చిన్నారిని ఇంటి పక్కనే నివాసం ఉండే నిందితుడు..సమీపంలోని ఓ గిడ్డంగికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇక్కడా అక్కడా అని కాదు. పట్టణాలు, పల్లెలకు తేడా లేదు. ఎక్కడో ఏదో చోట నుంచి రేప్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎంత ప్రచారం, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వీరిలో మార్పు రావడం లేదు. మళ్లీ మళ్లీ చట్టాలు తెచ్చినా మట్టితో సమానమంటు ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్నారు.