యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్- Video

0
97

ప్రస్తుతం రీల్స్ చేయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఈ రీల్స్ తో కొంతమంది ఫేమస్ అవుతుండగా..మరికొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బైక్ లపై సెల్ఫీలు, రైల్వే ట్రాక్ లపై, కదులుతున్న రైల్లో సెల్ఫీలు, రీల్స్ అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

వడ్డేపల్లికి చెందిన అజయ్‌ అనే యువకుడు ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్​ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్​ పక్కన వీడియో చేస్తున్న క్రమంలో ఖాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్​ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్నేహితులు అతనిని  ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://fb.watch/fkeMLfscJ6/