Flash News- డ్రగ్స్ కేసులో ఆసక్తికర పరిణామాలు

0
95

రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డ్రైవర్ కు ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న షారుఖ్ డ్రైవర్ ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయానికి రాగా, అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. అటు, ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ నిర్మాత ఇంతియాజ్ ఖత్రీకి కూడా నోటీసులు పంపారు. దాంతో ఖత్రీ కూడా ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

ఈ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టవడం తెలిసిందే. ఎన్సీబీ అధికారుల విచారణలో తాను డ్రగ్స్ వాడినట్టు ఆర్యన్ అంగీకరించాడు. ప్రస్తుతం ఆర్యన్ ముంబయి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను ముంబయి సిటీ కోర్టు కొట్టివేసింది. ఆర్యన్ బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.