Flash: హైదరాబాద్ లో మతాంతర వివాహం – గడ్డపారతో దాడి

0
89

హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి కొత్తగా వివాహం జరిగిన జంటను దారుణంగా గడ్డపారతో పొడిచి ఘటన స్థలం నుండి పరారయ్యాడు. నాలుగు నెలల క్రితం ఈ జంట ఆర్యసమాజ్ లో మతాంతర వివాహం చేసుకోవడమే ఈ హత్యాయత్నానికి  కారణమని పోలీసులు వెల్లడిస్తున్నారు.

మతాంతర వివాహం కారణంగా ఇరు కుటుంబాలలో చిన్న చిన్న కలహాలు చెలరేగడంతో కుటుంబ సభ్యుడే ఈ దారుణ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ హత్య చేసిన నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.