Flash: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య

0
79

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ సందీప్ నంగల్ దారుణ హత్యకు గురయ్యారు. షాకోట్‌ లోని మల్లియన్‌ కలాన్‌ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో కబడ్డీ ప్లేయర్ సందీప్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సందీప్ శరీరంలో 8 నుంచి 10 వరకు బుల్లెట్లు దూసుకెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు.