Breaking News- ఇంత దారుణమా..9వ తరగతి బాలికను రేప్ చేసిన తండ్రీకొడుకులు

Is it so bad..the father and son raped a 9th class girl

0
109

హ‌ర్యానాలోని పానిపట్​ జిల్లాలో స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న జ‌రిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై పొరుగుంట్లో ఉంటున్న తండ్రీకొడుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టారాని బాధితురాలు పేర్కొంది.

బాధితురాలు పానిపట్​లోని మోడల్​ టౌన్​లో కుటుంబ సభ్యులతో నివసిస్తుంది. తన ఇంటిపక్కనే ఉంటున్న అజయ్​ అనే యువకుడు..ఆ బాలికను ల‌వ్ చేస్తున్నానంటూ మ‌భ్య‌పెట్టాడు. ఈ క్ర‌మంలో కౌమ‌ర‌ద‌శ‌లో ఉన్న ఆ బాలిక అత‌డి మాటలు న‌మ్మి అజయ్​తో ప్రేమలో పడింది. ఈ క్ర‌మంలో ఆ బాలికను అజయ్​ తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఉన్న అజయ్​ తండ్రి సదర్​, అతని సోదరుడు అర్జున్​..మత్తుమందుతో కూడిన సిగరెట్​ కాల్చమని ఆమెను ఫోర్స్ చేశారు. అనంతరం అజయ్​ను పెళ్లి చేసుకుంటానని ఆ బాలిక చెప్పగానే..ఆమెపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు నెలల పాటు బాలికను తమ ఇంట్లోనే బంధించి రాక్ష‌స క్రీడ కొన‌సాగించారు. డైలీ డ్ర‌గ్స్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్ప‌డేవారు. అస‌లు ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితుల్లోకి బాలిక వెళ్లిపోయింది. బాధితురాలి మానసిక ఆరోగ్యం క్షీణించింది. చివ‌రకు వారి బారి నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకున్న బాలిక‌.. విషయాన్ని తల్లికి చెప్పింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అజయ్​, అర్జున్​, సదర్​, అజయ్​ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివ‌రించారు.