మోసాల్లో ఈ మోసం వేరయా..రూటు మార్చిన కేటుగాళ్లు..అసలేం జరిగిందంటే?

0
66

మోసాల్లో ఈ మోసం వేరయా..అవును మీరు చదివింది నిజమే. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో అమాయకులతో ఆడుకుంటున్నారు కేటుగాళ్లు. దీని కోసం కొత్త కొత్త ప్లాన్లతో సామాన్యులను బుట్టలో వేసి డబ్బులను దండుకుంటున్నారు. ఓటీపీతో ఒకడు, లింక్ లతో మరొకడు. ఇప్పటిదాకా జరిగిన మోసాలన్నీ ఇలాంటివే. కానీ కేటుగాళ్లు పంథా మార్చారు. ఓటీపీ, లింక్ ఇవేమి అవసరం లేకుండానే క్షణాల్లోనే ఖాతాలో డబ్బు ఖతం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.

ఓ వ్యక్తికి ‘కరెంట్ బిల్లు చెల్లించలేదు.. మీ విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. వెంటనే విద్యుత్ అధికారిని సంప్రదించండి’ అంటూ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి ఖంగుతిన్న సదరు వ్యక్తి.. వెంటనే ఆ మెసేజ్‌లో ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేశాడు. సీన్ కట్ చేస్తే.. కొన్ని గంటల వ్యవధిలో సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు స్వాహా అయ్యాయి.

రిమోట్ డెస్క్ యాప్‌ల ద్వారా అమాయకుల ఖాతాల నుంచి డబ్బులను మాయం చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో ఇదే తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనితో అప్రమత్తమైన విద్యుత్ విజిలెన్స్ అధికారులు.. ప్రజలను ఇలాంటి మోసాలను నమ్మొద్దని సూచిస్తున్నారు.