ఈ పిల్లిని తెచ్చి ఎన్ని ఎంత బహుమానం ఇస్తారో తెలిస్తే షాక్

It would be a shock to know how much gift you can bring this cat

0
125

చాలా మంది జంతువులని పెంచుకుంటూ ఉంటారు. వాటిపై ఎంతో ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఇక ధనవంతులు చాలా మంది కుక్కలని, పిల్లులని చాలా ఇష్టంగా పెంచుకుంటారు. ఇక అవి ఒక్క రోజు దూరం అయినా అస్సలు తట్టుకోలేరు. అందుకే వారితో పాటు ఆ జంతువులని కూడా బయటకు వెళ్లిన సమయంలో తీసుకువెళతారు. ఇంట్లో మనిషి లాగానే పెంపుడు జంతువులను ప్రేమిస్తూ ఉంటారు.

ఇటీవల తమ పెంపుడు జంతువులు తప్పిపోయాయి అని కొన్ని ప్రకటనలు చూస్తున్నాం. వాటి ఆచూకి తెలిపితే భారీగా బహుమతిని కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. హైదరాబాద్లో ఒక కుటుంబం ఎంతో ప్రేమగా ఒక పిల్లిని పెంచుకుంది. కానీ ఇటీవలే ఆ పిల్లి తప్పి పోయింది. దీంతో ఆ కుటుంబం మొత్తం బాధలో మునిగిపోయింది .తమ పిల్లి ఎవరికైనా కనిపిస్తే దాని ఆచూకి చెప్పాలని కోరుతున్నారు.

కొద్ది రోజులుగా చుట్టుపక్కల ఎంత వెతికినా ఆ పిల్లి ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే దాని ఆచూకి చెబితే
ఏకంగా 30 వేల రూపాయల వరకు బహుమానం ఇస్తాము అంటూ ఇటీవల ఒక మహిళ ప్రకటన విడుదల చేసింది.
జూన్ 24వ తేదీన ఆ పిల్లి తప్పిపోయిందని తెలిపారు. ఈ ప్రకటన మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.