చనువుగా ఉంటే ఆమె స్నేహం అనుకుంది – వీడు లవ్ అనుకున్నాడు చివరకు ట్విస్ట్ ఇది

It's the twist in the love story

0
88

కొంచెం చనువు ఇస్తే చాలు చాలా మంది అతిగా మార్చుకుంటారు. అయితే అవతల వారి ఇష్టాన్ని వీరు పట్టించుకోరు. జోద్ పూర్ లో విమల్ ఇదే చేశాడు. అతనితో కలిసి చదువుతున్నాను కదాఅని సరదాగా అతను మాట్లాడితే బేబీ అతనితో చనువుగా మాట్లాడేది. అది స్నేహం అనుకుంది అతను ప్రేమ అనుకున్నాడు. చివరకు ఓరోజు సినిమాటిక్ గా పూలు పట్టుకువచ్చి
చాక్లెట్ తెచ్చి ఐ లవ్ యూ అన్నాడు.

తన తల్లి దండ్రులు చూసిన అబ్బాయిని వివాహం చేసుకుంటాను. నాకు ప్రేమ ఇవి ఇష్టం లేదు అని ఆమె చెప్పింది. అయినా విమల్ మారలేదు. మద్యం తాగి ఆమెకి ఫోన్ చేయడం మెసేజ్ లు చేయడం ఇలా ఇబ్బంది పెట్టేవాడు. చివరకు ఓరోజు ఫోన్ చేసి నాకు ఐలవ్ యూ చెప్పకపోతే చనిపోతా అన్నాడు. ఆ కాల్ ఆమె రికార్డ్ చేసింది.

ఆమె దైర్యంతో వద్దు రేపు మాట్లాడుకుందాం అని చెప్పింది. ఇక బేబీ నా లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని మనోడు ఆనందపడ్డాడు. ఆమె ఓ చోటకి రమ్మని చెప్పింది. తన కుటుంబ సభ్యులని అక్కడకు తీసుకువెళ్లి అతను పెడుతున్న టార్చర్ చెప్పింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు మనోడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అతనిపై కేసు నమోదు చేశారు. అయితే నువ్వు నా ప్రేమ ఒప్పుకోపోతే చనిపోతా నా చావుకి నువ్వు కారణం అని రాసుకుంటా అని వార్నింగ్ ఇచ్చిన కాల్ రికార్డ్ పోలీసులకి ఇచ్చింది. ఆమె చేసిన పనికి అందరూ మెచ్చుకున్నారు.