ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఆయనది- నేడు తుదిశ్వాస విడిచారు

jiona chana is no more- He is the largest family in the world

0
96

మిజోరం రాష్ట్రానికి చెందిన జియోనా చనా అంద‌రికి తెలిసిన వ్య‌క్తే. అంతేకాదు ప్ర‌పంచంలోనే ఆయ‌న పేరు మీద ఓ రికార్డ్ ఉంది.ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఆయ‌న‌ది. జియోనాకు 38 మంది భార్యలు. 89 మంది పిల్లలు. 33 మంది మనవళ్లు-మనవరాళ్లు ఉన్నారు. ఇలా పెద్ద కుటుంబం ఆయ‌న‌ది త‌ప్ప మ‌రెవ‌రిది ప్ర‌పంచంలో లేదు.

ఇక ఆయ‌న రికార్డు క్రియేట్ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌పై అనేక వార్త‌లు జ‌ర్న‌ల్స్ డాక్యుమెంట‌రీలు వ‌చ్చాయి. అయితే ఆయ‌న ఈరోజు మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌సు 76 ఏళ్లు జియోనా మరణాన్ని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ధ్రువీకరించారు.

ఆయన గ్రామం పర్యాటక స్థలంగా మారిందని గుర్తుచేశారు. అయితే కొద్ది కాలంగా ఆయ‌న‌కు అనారోగ్యం ఉంది. ముఖ్యంగా బీపీ – షుగ‌ర్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డ్డారు. నేడు ఐజ్వాల్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఆయన 17 ఏళ్ల వయసులో తొలి వివాహం చేసుకున్నారు. వీరు అంద‌రూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. అంద‌రూ ప‌నులు చేసుకుని ఆ డ‌బ్బులు జియోనాకి ఇచ్చేవారు. ఇప్ప‌టికీ ఒకే కిచెన్ లో వారి వంట జ‌రుగుతుంది.