విలేకరి కాళ్లకు బేడీలు..

0
112

అనునిత్యం మనకు సమాచారాన్ని తెలియజేసే విలేకరి పట్ల బాలేశ్వర్‌ జిల్లా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆసుపత్రిలో మంచానికి, కాలికి కలిపి బేడీలు వేసి ఘోరంగా అవమాన పరిచారు. ఇలా చేయడంతో ఎస్పీ కూడా మండిపడ్డారు. అసలేం జరిగిందంటే..బుధవారం హోంగార్డుపై దాడి చేసిన ఆరోపణలపై నీలగిరి స్టేషన్‌ పోలీసులు ఆ ప్రాంతంలో విలేకరిగా పనిచేస్తున్న లోక్‌నాథ్‌ దొళాయిని అరెస్టు చేశారు.

ఆయన అనారోగ్యానికి గురి కావడంతో బుధవారం రాత్రి నీలగిరి ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అక్కడ కాపలాలో ఉన్న పోలీసులు బుధవారం రాత్రి లోక్‌నాథ్‌ కాలికి, మంచానికి కలిపి సంకెళ్లు వేశారు. విషయం తెలియడంతో బాలేశ్వర ఎస్పీ స్పందించి వెంటనే బేడీలు తొలగించాలని ఆదేశించడంతో..వెంటనే తొలగించారు. అంతేకాకుండా ఈ ఘటనపై దర్యాప్తునకు డీఎస్పీకి ఆదేశించారు