Breaking: జూబ్లిహిల్స్ పబ్ కేసు..నిందితులపై సుమోటో కేసు నమోదు

0
87

హైదరాబాద్ జూబ్లిహిల్స్  పబ్ రేప్ కేసులో అమ్మాయి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ చేసినవారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ కేసులో అమ్మాయి ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన ఏ ఒక్కరిని వదలకుండా సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసారు. ఈ కేసులో ముఖ్య కారకుడైన ఓల్డ్ సిటీకి చెందిన సుభాన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.