పెళ్లైన వారం రోజులకే భర్త ముందే భార్య ప్రియుడితో జంప్..

0
112

ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువతీ, యువకులు ప్రేమలో పడి కనీస బాధ్యతలు మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ యువతీ కూడా ప్రియుడి మోజులో పడి పెళ్లైన వారం రోజులకే  తన భర్తకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని ముంగేరీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..ముంగేరీకి చెందిన మోని కుమారికి బీకాపూర్ సంతోషిమాత గల్లిలో నివసించే వివేక్ కుమార్‌తో జూన్ 14వ తేదీన వివాహం జరిగింది. తల్లిదండ్రుల సమక్షంలో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. పెళ్ళికి వచ్చిన అతిధులు, స్నేహితులు కూడా పెళ్ళిలో ఆనందంగా గడిపి..జంటను ఆశీర్వదించారు.

పెళ్ళి జరిగిన వారంరోజులకు భార్యతో  కలిసి వివేక్ కుమార్‌ గాజులు కొనడానికి మార్కెట్‌కు వెళ్లారు. అనంతరం నూతన వధువరుల దగ్గరికి ఒక కారు వచ్చి ఆగగా..భార్య తన భర్త చేయి విడిచిపెట్టి ప్రియుడి కారు ఎక్కి వెళ్లిపోయింది. దాంతో వివేక్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు.