కమ్మదానమ్ ఫామ్ హౌస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి(Kammari Krishna) హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆస్తి కోసం కొడుకే తండ్రిని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. మూడో భార్యకు ఆస్తి మొత్తం రాసిస్తాడనే నేపథ్యంలోనే బాడీగార్డ్ బాబాకు సుపారి ఇచ్చి మర్డర్ చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే…
రంగారెడ్డి – షాద్ నగర్లోని కమ్మదానమ్ ఫామ్ హౌస్‌లో.. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. కన్నకొడుకే తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చిమరీ హత్య చేయించాడు. మృతుడు కమ్మరి కృష్ణ చాలాకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పలు ఆస్తులు కలిగి ఉన్నాడని ఇందులో భాగంగా బండ్లగూడలోని కేకే కన్వెన్షన్, కమ్మదానమ్ లోని కేకే ఫామ్ హౌస్ ఉందని, అయితే మృతుడు కృష్ణ మొదటి భార్య ఆమె పిల్లలను పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకొని ఆవిడ మరణించిన తదుపరి మూడో వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
మూడో వివాహం చేసుకున్న పావనికి దాదాపు 16 కోట్ల విలువచేసే టెన్ మోర్ బిల్డింగ్, కేకే బిల్డింగ్ లను రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు.. అయితే ఆస్తి విషయంలో మొదటి భార్య పెద్దకొడుకు శివ, కృష్ణతో గొడవపడ్డాడని, కృష్ణ(Kammari Krishna)ను ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం రాసి ఇస్తాడనే ఉద్ధేశ్యంతో ఎలాగైనా కృష్ణను చంపాలని ప్లాన్ వేశాడని పోలీసులు వెల్లడించారు. ఎలాగైనా కృష్ణను చంపాలని ప్లాన్ వేసిన కొడుకు శివకుమార్ కృష్ణ వద్ద పని చేసే బాడీ గార్డ్ బాబాకు 25 లక్షలు, ఒక ఇల్లు ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు అంగీకరించిన బాబా రెండు లక్షలు తీసుకొని ఈ నెల 10వ తేదిన సాయంత్రం 5:30 నిమిషాలకు బాబా, జీలకర్ర గణేష్ ఆలియస్ లడ్డు, ఇంకొక వ్యక్తితో కలిసి కమ్మదానమ్ లోని కేకే ఫార్మ్ హౌస్కు చేరుకొని జీలకర్ర గణేష్, ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి కమ్మరి కృష్ణను కత్తితో అతి క్రూరంగా గొంతు కోసి, పొట్టలో పొడిచి చంపేశారని పోలీసులు తెలిపారు.