ఆరుగురి పిల్ల‌ల్ని బావిలో పడేసి చంపిన కన్నతల్లి..కారణం ఏంటంటే?

0
115

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకు కోపంతో ప్రాణాలను బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. తాజాగా ఇలాంటి ఘటనే మ‌హారాష్ట్ర‌లోని రాయ్‌గ‌డ్ జిల్లాల్లో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన కారణంగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే..ఇంట్లో చిన్న వివాదం కారణంగా ఓ మహిళా తన కన్నపిల్లలను కడతేర్చుకుంది. అన్యం పుణ్యం తెలియని చిన్నారుల ప్రాణాలు బలితీసుకొన్న ఈ ఘటన వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌హ‌ద్ తాలూకాలోని ఖారావ‌లి గ్రామంలో చోటుచేసుకుంది. చ‌నిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదు మంది అమ్మాయిలు ఉండగా..ఒక అబ్బాయి ఉన్నాడు.

అనంతరం సమాచారం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని 30 ఏళ్ల మ‌హిళ‌ను విచారించగా..కుటుంబీకులు కొట్ట‌డం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు తెలిపింది. ఆ బావిలో ప‌డి ప్రాణాలు కోల్పోయిన పిల్ల‌ల వ‌య‌సు 18 నెల‌ల నుంచి 10 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు.