ఈ మధ్య కాలంలో చిన్నచిన్న కారణాల వల్ల కోపంతో క్షణాల్లోనే ప్రాణాలు బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ప్రేమ వ్యవహారాలలో అధికంగా చోటుచేసుకుంటాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా..తాజాగా ఇలాంటి ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై యువకుడి దాడికి పాల్పడిన ఘటన గుంటూరు కృష్ణానగర్‌లో చోటుచేసుకుంది.
తల్లి, కుమార్తె గొంతుపై బ్లేడ్‌తో యువకుడు దాడిచేయడంతో స్థానికులు గాయపడిన వారిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారు. యువకుడు దాడి చేసిన అనంతరం రెండో అంతస్థు నుంచి దూకేందుకు ప్రయత్నించినా ఘటన కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయం వద్దనున్న అపార్టుమెంట్‌లో చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని..బాధితులకు చికిత్స అందిస్తున్నారు.