Home క్రైమ్ హిందువుల విరాళాలతో లోన్లు..మోసగాళ్ల గుట్టురట్టు చేసిన సినీ నటి కరాటే కల్యాణి

హిందువుల విరాళాలతో లోన్లు..మోసగాళ్ల గుట్టురట్టు చేసిన సినీ నటి కరాటే కల్యాణి

0
92

2017లో కరుణాకర్ సుగుణ అధ్యక్షుడిగా శివ శక్తి ఆధ్యాత్మిక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. పాస్టర్ తో కుమ్మైకై ఉపాధ్యక్షుడు పివి సతీష్, సభ్యులు విజయ్ కుమార్, శ్రీనివాస రాజు మరో ఇద్దరిని ఫోర్జరీ సంతకాల ద్వారా యాజమాన్యం నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. చీకటి ఒప్పందం చేసుకొని హిందువుల వద్ద ఫౌండేషన్, సొసైటీలకు రెండు సార్లు గత ఏడాది ఈ ఏడాది ఫండ్స్ వసూలు చేసారని తెలిపారు.

ఈ విషయమై తానూ నిలదీసి సిసిఎస్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సొంత కుటుంబ అప్పులు తీర్చడానికి లాభాపేక్ష లేని సంస్థ నుంచి విరాళాలు సేకరిస్తున్నారని ఆరోపించారు. హిందు బంధువులు ఎవరైనా శివ శక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక, శివ శక్తి ఫౌండేషన్ లకు దయచేసి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని వేడుకున్నారు.

శివశక్తి ఆధ్యాత్మిక వేదిక, శివశక్తి ఫౌండేషన్ అనే సంస్థ హిందువుల నుండి ధారాళంగా విరాళాలు స్వీకరించారు. ఇక ఆ డబ్బుతో తమ సోసైటీలో కోశాధికారిగా, ఫౌండేషన్ లో డైరెక్టర్ గా ఉన్న దేవిరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి నడుపుతున్న ఇంజినీర్ క్యాడ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన 2.5 కోట్ల అప్పులు తీర్చారు. ఈ ఘటనలో శివశక్తి అధ్యక్షుడు, డైరెక్టర్ అయిన కరుణాకర్ సుగ్గున, క్యాడ్ డైరెక్టర్ లు అయిన దేవిరెడ్డి ఆనంద కుమార్ రెడ్డి , సునీతా రేడ్డిపై కరాటే కళ్యాణి ఫిర్యాదుపై ప్రాధమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. 420, 406, 465, 468, 471, రెడ్ విత్ 34 IPC క్రైం నంబర్ 210/2121 లో కేస్ నమోదు చేసి ముద్దయిలయిన A1 కరుణాకర్ సుగ్గున , A2 దేవి రెడ్డి ఆనంద కుమార్ రెడ్డి, A3 సునీతా రెడ్డి మొదలగు వారిపై దర్యాప్తు వేగవంతం చేసారు.

కరాటే కళ్యాణి ఫిర్యాదుపై శివశక్తి సంస్థ అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గున ఆర్థిక అక్రమాలపై అదనపు డీజీపీ విచారణకు ఆదేశించారు. ఏంఫోర్స్ మేంట్ డైరేక్టరేట్, ఇంకమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లకు విచారణ చెప్పట్టమని అదనపు డీజీపీ ఆదేశించారు. ఈ కేసులో ఉన్న కార్పరేట్ ఫ్రాడ్ , ఇన్సైడర్ ట్రడింగ్ , షెల్ కంపెనీల తీవ్రత దృష్ట్య ఏంఫోర్స్ మేంట్ డైరేక్టరేట్, ఇంకమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ లకు విచారణ చేపట్టాలని అదనపు డీజీపీ ఆదేశించారు.