ఫ్లాష్: క్రికెట్ బెట్టింగ్ లో కీలక నిందితుడు అరెస్ట్..

0
115

ఈ మధ్య కాలంలో అక్రమంగా డబ్బు సంపాదించే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. ముఖ్యంగా పురుషులు క్రికెట్ ఆటపై వున్న క్రేజ్ తో ఎంతోమంది జేబులను ఖాళీ చేస్తున్నారు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా  క్రికెట్ బెట్టింగ్ రాజ్యమేలుతోంది.

ఇప్పటికే పోలీసులు ఎంతో మంది నిందితులను అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించిన కూడా సమాజంలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా క్రికెట్ బెట్టింగ్ చేసే ఆటగాడిలలో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ లకు అండగా ఉన్న అమిత్ గుజరాతి హైదరాబాద్ ఎట్టకేలకు అరెస్ట్ చేసారు.

ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న అమిత్ గుజరాతి ఇతర రాష్ట్రంలో పోలీసులు పట్టుకున్నారు. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను కూడా అమిత్ గుజరాతి దగ్గరి నుండి హైదరాబాద్ పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. నేడు అమిత్ గుజరాతి కోర్టులో హాజరు పరచనున్నారు.