సెల్ ఫోన్ కోసం అన్ననే చంపేశాడు – ఎంత పెద్ద స్కెచ్ వేశాడంటే

మొబైల్ ఇవ్వనందుకు ఓ యువకుడు తన అన్ననే హత మార్చాడు

0
81

కొందరిని చూస్తుంటే మనుషులు ఇలా తయారయ్యారు ఏమిటి అని బాధ కలుగుతుంది. చిన్న చిన్న వస్తువుల కోసం మాట పట్టింపుల కోసం ఏకంగా హత్యలకు కూడా తెగపడుతున్నారు. యూపీలో దారుణం జరిగింది. మొబైల్ ఇవ్వనందుకు ఓ యువకుడు తన అన్ననే హత మార్చాడు. అంతేకాదు ఇతను చేసిన పని తెలిసి గ్రామస్తులే కాదు వార్త విన్న అందరూ కూడా ఇతను మనిషి కాదు అంటున్నారు.

యూపీలోని సహరాన్పూర్, థానా గంగోహ్ పరిధిలోని ఫతేపూర్ ధోలా గ్రామంలో ఇద్దరు సోదరులు ఫర్మాన్, రెహమాన్ ఉన్నారు. జులై 18వ తేదీన ఈద్ కి మూడు రోజుల ముందు ఫర్మాన్ కొత్త ఫోన్ కొన్నాడు. ఫర్మాన్ ఇంటికి వచ్చిన తర్వాత అతని తమ్ముడు రెహమాన్ కూడా తనకు ఫోన్ కావాలని డిమాండ్ చేశాడు. అతను ఫోన్ ఇవ్వను అన్నాడు.
ఇద్దరికి గొడవ జరగడంతో రెహమాన్ తన అన్న ఫర్మాన్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. అన్నయ్య చనిపోయాడు.

దీంతో తమ్ముడు రెహమాన్ భయపడి అన్న శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆపై ఇంట్లోనే గొయ్యి తవ్వి ఖననం చేశాడు. ఇక ఎవరికి అనుమానం రాకుండా అక్కడే గ్రామంలో తిరిగాడు. అన్న ఎక్కడ అని అడిగితే పనికి వెళ్లాడు అని చెప్పాడు. కాని ఇంటి నుంచి దుర్గంధం రావడంతో గ్రామస్తులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. వారు వచ్చి ప్రశ్నిస్తే తన సోదరుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కొంతకాలం క్రితం చనిపోయారు. అక్కచెల్లెల్లకు వివాహాలు కూడా చేశారు. వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కాని సెల్ ఫోన్ కోసం ఇంతలా చంపేశాడు.