ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యుగం. ఇంత డవలప్ అవుతున్నా కొందరు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. కట్టుబాట్లు నియమాలు అంటు గుమ్మం కదలనివ్వరు. మహిళల ఆనందానికి అడ్డు వస్తారు. ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. 17 ఏళ్ల ఓ టీనేజ్ అమ్మాయిని కుటుంబ సభ్యులే కొట్టి చంపారు. అయితే ఎందుకో తెలుసా ఆమె ఫ్యాషన్ గా జీన్స్ ఫ్యాంట్ వేసుకుంది అని కోపంతో. యూపీలో దియోరియా జిల్లాలోఈ దారుణం జరిగింది.
ఆ అమ్మాయి కుటుంబం ఉపాధి కోసం పంజాబ్ కు వలస వెళ్లింది. ఇక ఇటీవల ఆమె సొంత గ్రామానికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జీవనశైలి ఇంటిలో వారికి నచ్చలేదు. దీంతో ఇంటి సభ్యులు ఆమెకి నచ్చ చెప్పారు. అయినా ఆమె మారలేదు. ఇటీవల ఉపవాసం ఉండి గుడికి వెళ్లడానికి జీన్స్ వేసుకుంది. ఈ సమయంలో పెద్దలు ఇలా వెళ్లద్దు అన్నారు చివరకు ఇంట్లో వారు ఆమెని కర్రలతో కొట్టారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.
స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పి, బ్రిడ్జి పైనుంచి విసిరేశారని తల్లి చెబుతోంది. యూపీలో దియోరియా జిల్లాలో ఓ బ్రిడ్జి రెయిలింగ్ కు అమ్మాయి శవం వ్రేలాడుతూ కనిపించింది. చివరకు ఆమె కుటుంబ సభ్యులని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.