ఉత్తర కొరియాలో యువతపై కిమ్ మరో కోత్త చట్టం – ఈ పని చేస్తే 15 ఏళ్లు జైలు శిక్ష

Kim has another new law on youth in North Korea

0
133

ఉత్తర కొరియాలో ప్రజలు కిమ్ కుటుంబం అమలు చేస్తున్న చట్టాలు పాటించాల్సిందే. లేదంటే వారికి ఎలాంటి శిక్షలు విధిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కిమ్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో ఎలాంటి అదేశాలిస్తాడో అన్న భయంతో అక్కడివారు వణికిపోతున్నారు. ఇక ఇక్కడ యువత కూడా ఇష్టం వచ్చిన రీతిలో హెయిర్ కట్ చేయించుకోకూడదు. దుస్తులు కూడా అంతే ట్రెండ్ ని అస్సలు ఫాలో అవ్వరు . ఆ దేశంలో కిమ్ ట్రెండ్ వారు ఫాలో అవ్వాల్సిందే.

ఈ మధ్య ఉత్తర కొరియా యువత దక్షిణకొరియా ట్రెండ్ ను ఫాలో అవుతుండటం కిమ్ కు ఏమాత్రం నచ్చటంలేదు.
ఇకపై వేషదారణలో ఇతర దేశాల శైలిని అనుకరించవద్దని స్పష్టమైన అదేశాలను కిమ్ ప్రభుత్వం జారీ చేసింది. కొందరు ఈ మధ్య బట్టలే కాదు మాట, యాస, భాష కూడా దక్షిణ కొరియాలో మాట్లాడుతున్నారని తెలిసింది. వారికి కఠిన శిక్షలు విధిస్తాం అని చెబుతున్నారు.

ఈసారి చాలా గట్టిగా యువతకి హెచ్చరికలు జారీచేశారు. ఇక ఎవరైనా అక్కడ వీడియోలు చూసినా, బట్టలు అలాంటివి ధరించినా అక్కడ భాష మాట్లాడినా, ఇక వారికి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. దీనిపై 215 నిబంధనలను రూపొందించారు. టైట్ జీన్స్ ఫ్యాంట్లు, బొమ్మల టీషర్టులు వేయకూడదు అమ్మకూడదు. ఇక అక్కడ సినిమాలు చూసినా సంగీతం విన్నా వారికి ఈ శిక్ష విధిస్తారు.