బ్రష్ చేయకుండా ముద్దులు..అడ్డుకున్న భార్యను నరికి చంపిన భర్త

0
216

అప్పటివరకు ఆ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వారికీ అపురూపమైన కొడుకు. ఇంకేమి కావాలి. ఎంచక్కా భార్య, కొడుకును చూసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేయక..కట్టుకున్న భార్యనే కడతేర్చాడు భర్త. అది కూడా ఒక చిన్న కారణానికే. దీనితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళలోని పాలకడి జిల్లాలో అవినాష్ నివాసం ఉంటున్నాడు. అతనికి గతంలో వివాహం కాదా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి 2019లో దీపిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. అయితే ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా అవినాశ్ కుమారుడ్ని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించగా.. భార్య దీపిక అడ్డుకుంది.

ఇదే విషయంపై భార్యాభర్తలు ఇద్దరు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాట, మాట పెరగడంతో… భర్త అవినాష్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కోపంతో ఊడిపోయిన భర్త భార్యను ఇంట్లో ఉన్న కత్తితో దారుణంగా హత్య చేశాడు. పొరుగింటివారు దీపికను ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది.