Murder: చంపేసి కట్టు కథ అల్లాడు.. చివరకి పట్టుబడ్డాడు

-

Murder: తాను ప్రేమిస్తున్న యువతిని వేధిస్తున్నాడని స్నేహితుడిని చంపేశాడా యువకుడు. తన మిత్రుడిని ఎవరో చంపేశారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగటంతో.. చివరికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి ఠాణా పరిధిలో గతనెల 28న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూసాపేట యాదవబస్తీకి చెందిన దాసరికి మణికంఠ(23), అదే ప్రాంతంలోని ఆంజనేయనగర్‌ నివాసి నర్వల శంకర్‌(30) స్నేహితులు. గూడ్స్‌ షెడ్‌ రోడ్డులోని ఓ సంస్థలో ఇద్దరూ విధులు నిర్వర్తిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని శంకర్‌ ప్రేమించాడు. ఆమెతో మణికంఠకూ పరిచయం ఉంది.

- Advertisement -

మణికంఠ సదరు యువతితో వాట్సప్‌ చాటింగ్‌ చేసేవాడు. దీన్ని ఇబ్బందిగా భావించిన యువతి.. ఈ విషయం శంకర్‌కు చెప్పింది. దీంతో యువతి విషయమై, శంకర్‌, మణికంఠల మధ్య గొడవలు జరిగాయి. అయినా మణికంఠ తన ప్రవర్తన మార్చుకోకుండా యువతిని వేధించటం మెుదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న శంకర్‌.. మణికంఠను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గత నెల 28న రాత్రి 9.30 గంటల సమయంలో కైత్లాపూర్లోని మైదానంలో మద్యం తాగటానికి వెళ్దామని శంకర్‌ మణికంఠను వెంటబెట్టుకొని తీసుకువెళ్లాడు. ఇద్దరూ అక్కడ మద్య తాగిన తరువాత.. తన ప్రియురాలిని ఎందుకు వేధిస్తున్నావని శంకర్‌ మణికంఠతో గొడవకు దిగాడు.

పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో మణికంఠపై శంకర్‌ దాడి చేసి.. హత్య(Murder) చేశాడు. అనంతరం డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన మిత్రుడిని ఎవరో చంపేశారని సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లేసరికి శంకర్‌ మణికంఠ శవం పక్కనే ఉన్నాడు. మేము ఇక్కడ మద్యం తాగుతుంటే.. ఎవరో వచ్చి దాడి చేశారు.. స్నేహితుడు చనిపోయాడు అంటూ పోలీసుల ముందు కట్టుకథ అల్లాడు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి.. శంకర్‌ను విచారించగా.. నేరం అంగీకరించాడు.

Read also: Munugode: మునుగోడు మూగబోయింది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...