కర్నూలు – వ్యభిచార గృహంపై పోలీసులు రైడ్

Kurnool: Police raid a brothel

0
130

ఈ రోజుల్లో కొందరు కేటుగాళ్లు, అమాయక మహిళలకు మాయ మాటలు చెప్పి, లొంగతీసుకుని వారి చేత వ్యభిచారం చేయిస్తున్నారు. మరికొందరు డబ్బు కోసం ఈ వృత్తిలోకి వస్తుంటే,ఇంకొందరు మోసపోయి ఈ చీకటిలో మగ్గిపోతున్నారు. తాజాగా కర్నూలులో మాధవీనగర్ శివారులోని స్టేట్బ్యాంక్ కాలనీలో, వ్యభిచార గృహంపై మూడో పట్టణ పోలీసులు దాడులు చేశారు.

ఇక్కడ వెంకటేశ్వర్లు, కీర్తి కలిసి కొంత కాలంగా ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నడుపుతున్నారు.ఎవరికి అనుమానం రాకుండా అందరితో మంచిగా ఉంటున్నారు. కానీ స్ధానికులకి వీరిపై అనుమానం రావడంతో, పోలీసులకి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రైడ్ చేశారు. నిర్వాహకుడు వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.

అలాగే విటుడు జాకీర్హుసేన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక కీర్తి పరారీలో ఉంది ఆమె కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.