లేడీ డాక్టర్ స్నానాల గదిలో స్పై కెమెరా పెట్టిన మరో డాక్టర్ – ఆమె ఎలా పసిగట్టిందంటే

పడక గదిలో మరో స్పై కెమెరా బయటపడింది

0
114

కొందరు కేటుగాళ్లు మహిళలు స్నానాలు చేసే బాత్రూమ్ లో, అలాగే డ్రెస్ చేంజ్ చేసుకునే ప్లేస్ లో స్పై కెమెరాలు పెడుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. టెక్నాలజీ సాయంతో మహిళలు ఇలాంటి వారిని గుర్తు పడుతున్నారు. వారిని పోలీసులకి అప్పగిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని హోటల్స్, షాపింగ్ మాల్స్ ,బట్టల దుకాణాల్లో ఇలాంటి చెడ్డ పనులు చేసిన వారు కటకటాల పాలయ్యారు. ఇంకా కొందరు మాత్రం ఇలాంటి దారుణమైన పనులు చేస్తున్నారు.

ముంబైలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది.ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో ఓ వైద్యురాలు ట్రైనీగా పనిచేస్తూ రెసిడెన్షియల్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. అయితే ఆమె ఇటీవత తన బాత్రూమ్ లో లైట్ పనిచేయడం లేదు అని ఎలక్ట్రీషియన్ను పిలిచింది. అందులోంచి స్పై కెమెరా బయటపడింది. దీంతో అప్రమత్తమైన వైద్యురాలు మొత్తం ఇళ్లు అంతా చెక్ చేయించింది.

అన్నీ రూమ్స్ చూసిన తర్వాత పడక గదిలో మరో స్పై కెమెరా బయటపడింది. దీంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే అదే మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 42 ఏళ్ల న్యూరాలజిస్ట్ ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.