ఈ విశాల ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అనేక చట్టాలు ఉన్నాయి. ఈ రూల్స్ కచ్చితంగా ఆ దేశంలో ఉన్న వారు పాటించాల్సిందే. ఇతర దేశాల నుంచి వెళ్లిన విదేశీయులు కూడా ఇవి తప్పనిసరిగా పాటించాలి. ఇక అక్కడ ఉన్న చట్టాలు నియమాలు తప్పక తెలుసుకోవాలి. అయితే కొన్ని చట్టాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని చట్టాలు మరీ భయంకరంగా ఉంటే కొన్ని వినడానికి చాలా వింతగా విడ్డూరంగా ఉంటాయి.
నగరానికి – నగరానికి మధ్య కొన్ని రూల్స్ ఉంటాయి. మరి ఇలాంటి కొన్ని వింత రూల్స్ గురించి తెలుసుకుందాం. అండర్గార్మెంట్లకు సంబంధించిన చట్టాల గురించి మీరు ఈ విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. అమెరికాలోని మిన్నెసోటాలో ఓ యునిక్ ప్లేస్ ఉంది ఈ ప్రదేశంలో మగ, ఆడ అండర్గార్మెంట్లను వైర్లపై ఆరబెట్టడం అక్కడ కుదరదు. ఇద్దరి దుస్తులు వాషింగ్ మిషన్ లో కలిపి ఉతకకూడదు.
థాయ్లాండ్లో లోదుస్తులు తప్పనిసరిగా ధరించాలనే రూల్ ఉంది.
సెవిల్లెలో లోదుస్తుల గురించి మాట్లాడకూడదు, బయట ఆరబెట్టకూడదు.
జపాన్లో కొన్ని ప్రదేశాలలో మహిళలు బ్రాలు ధరించడం తప్పనిసరి అనే రూల్ ఉంది.
ఉరెగ్విన్ సిటీలో ఎవరైనా లో దుస్తులు లేకుండా బయటకు వస్తే మన కరెన్సీ లెక్కల్లో 10 వేలు జరిమానా