యూపీలో ఘోరం..కోర్టులో న్యాయవాది దారుణ హత్య

Lawyer brutally murdered in UP

0
71

ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజంపూర్‌లో ఘోరం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ లాయర్‌ను కొందరు దుండగలు కాల్చి చంపేశారు. జిల్లా కోర్టులోని మూడో అంతస్థులో ఒక న్యాయవాదిని దుండగులు కాల్చి చంపారు. మృతి చెందిన లాయర్ పేరు భూపేంద్ర ప్రతాప్ సింగ్‌ అని సమాచారం.

ఆయన జలాల్‌బాద్‌కు చెందిన వారని తెలుస్తోంది. భూపేంద్రపై కాల్పులు జరిగిన సమయంలో తూటాల శబ్దానికి కోర్టులో ఉన్న వారందరూ భయాందోళనలకు లోనయ్యారు. ఈ హత్యపై లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు.