Flash: హైదరాబాద్ లో ప్రముఖ సింగర్ ఆత్మహత్య

0
75

హైదరాబాద్‌ లోని చంపాపేటలో ప్రముఖ సింగర్ సూసైడ్ చేసుకున్నాడు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం పిల్లి గుండ్ల తండాకు చెందిన జటావత్ మోహనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. చంపాపేటలోని తన గదిలో సింగర్  ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. పలు బంజారా పాటలు యూట్యూబ్ లో ఎంతగానో ఆకట్టుకున్నాయి.  సింగర్‌ మృతితో పిల్లి గుండ్ల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.