24 ఏళ్లుగా పనిచేయని లిఫ్ట్ – నేడు బాగుచేస్తూ లోపల ఏముందో చూసి షాక్

Lift that has not worked for 24 years - Shock to see what's inside repairing today

0
72

ఉత్తర ప్రదేశ్లోని బస్తీ జిల్లాలోని కైలీలో ఓ ఆస్పత్రి ఉంది. అక్కడ జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. చాలా కాలం పాటు పనిచేయకుండా ఉన్న ఓ లిఫ్ట్ను తెరిచి చూసేసరికి అందులో గుర్తు తెలియని ఓ వ్యక్తి అస్థిపంజరం బయటపడింది. సెప్టెంబర్ 1 న ఈ వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ బయటపడ్డ అస్థిపంజరం ఎవరిది అని పోలీసులు విచారణ చేస్తున్నారు.
కైలిలో 500 మంచాల సామర్థ్యం ఉన్న ఆసుపత్రి నిర్మాణాన్ని 1991లో ప్రారంభించారు. ఇక్కడ ఉన్న లిఫ్ట్ 1997 వరకు పనిచేసింది.

ఆ తర్వాత నిర్వాహణ లేకపోవడంతో ఆగిపోయింది. దానిని అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆస్పత్రి వారు 24 ఏళ్ల తర్వాత దానిని బాగు చేయించాలి అని అనుకున్నారు. మెయింటినెన్స్ వారు వచ్చి లిఫ్ట్ కింద చూస్తే వారికి ఓ అస్థిపంజరం లభించింది. పోలీసుల విచారణ వైద్యుల టెస్టుల్లో ఆ అస్తిపంజరం మగ వ్యక్తిగా తేలింది. ఫోరెన్సిక్ నిపుణులు డీఎన్ఏ పరీక్షకు పంపించారు.

అన్నీ పోలీస్ స్టేషన్లలో 24 ఏళ్ల క్రితం తప్పినపోయిన కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఆ వ్యక్తి లిఫ్ట్లో ఇరుక్కుపోవడం వల్ల మరణించాడా. లేదా ఎవరైనా చంపేశారా అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది.