న్యూడ్ ఫోటోల పేరుతో లోన్ యాప్ వేధింపులు..భార్యాభర్తల ఆత్మహత్య

0
127

లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు అంతకంతకు పెరుగుతున్నాయి. లోన్ యాప్ వేధింపులకు  పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక తాజాగా ఏపీకి చెందిన దంపతులు లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దుర్గారావు ఆర్థిక ఇబ్బందులతో రెండు యాప్ లలో అప్పు చేశారు. ఇప్పటికే కొన్ని డబ్బులు చెల్లించాడు. మిగిలిన డబ్బుల కోసం యాప్ నిర్వాహకులు వేధించారు. దుర్గారావు భార్య ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అసభ్యకర ఫోటోలను నిర్వాహకులు వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేశారు. దీంతో లాడ్జిలో విషం తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.