ఆన్‌లైన్ రుణయాప్‌ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఈ రుణ యాప్ లు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాలో మరో ప్రాణం బలైంది. తీసుకున్న అప్పు కట్టేందుకు యాప్‌లో రుణం అదీ కట్టలేక క్రెడిట్ కార్డుల వినియోగం…అయినా అప్పుల వేధింపులు ఆగకపోవడం వల్ల ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది.