ఇంట్లో ఒంటరిగా అమ్మాయి -అత్యాచారం చేసి 15 లక్షలు దోపిడి

Lonely girl at home-Rape and extortion of 15 lakhs

0
109

కోల్ క‌తాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో దారుణం జరిగింది. 26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. అంతేకాదు ఇంటిలో ఏకంగా రూ. 15 లక్షల నగదు దోచుకెళ్లిపోయారు.
కోల్ క‌తాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది.
అపార్ట‌మెంట్ లోని తన ఫ్లాట్ లో యువతి ఒంటరిగా ఉంది.

ఈ సమయంలో ఆమెపై అత్యాచారం చేశారు ఈ దుండగులు. ఆమెపై అత్యాచారం జరిగింది అని వైద్య పరీక్షల్లో తేలింది. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
అత్యాచారానికి ముందు యువతిని కట్టేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

ఆ పార్ట్ మెంట్ దగ్గర్లోని అన్నీ సీసీటివి పుటేజీలు పరిశీలిస్తున్నారు. కోల్ క‌తాలోని డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే వారు దొంగల ముఠానా, లేదా తెలిసిన వారే ఈ దారుణం చేశారా అనేదానిపై విచారణ చేస్తున్నారు.