అమెరికాలో జానీల్ అనే వ్యక్తి చిన్నతనంలో ఈ అశ్లీల వెబ్ సైట్లు చూస్తు తన తండ్రికి కనిపించాడు. దీనిపై అతని తండ్రి చాలా కోప్పడతాడని ఇక నా పని అయిపోయింది అని చాలా భయపడ్డాడు. అయితే నన్ను చూసిన తర్వాత మా నాన్న ఓ రెండు గంటలు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత స్కూల్ కు వెళుతున్న సమయంలో ఆయనే నన్ను స్కూల్ లో దింపుతా అన్నాడు.
ఈ సమయంలో ఓ చోట కారు ఆపారు. నువ్వు కాలేజీలో చేరడానికి ఇక ఆరు నెలల సమయం ఉంది, ఈ సమయంలో నీకు వచ్చే కోరికలు ఆపుకోవాలి. లైఫ్ లో ఎదగడానికి ఎక్కువ కష్టపడాలి. నువ్వు చేస్తుంది తప్పు ఇలాంటి పని మరోసారి చేయకు. ఇది అమ్మకి అందరికి తెలిస్తే నిన్ను హీనంగా చూస్తారు అని చెబుతాడు.
మా నాన్న ఇలా చెప్పడంతో నేను కాస్త ఆలోచించా, అయితే ఇలాంటి విషయాల్లో నన్ను తిట్టకుండా చదువు ధ్యాస అక్కడే ఉంచాలి అని చెప్పారు మాతండ్రి. దీంతో కంప్యూటర్ సైన్స్ చేశా, మంచి ఉద్యోగం చేస్తున్నా. అయితే ఓ వ్యక్తి తండ్రి మందలించాడు అని ఈ విషయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి నాకు బాధ కలిగి ఈ పోస్ట్ పెడుతున్నా అని ఆ వ్యక్తి ఈ విషయం తెలియచేశాడు.