సెల్ ఫోన్ పోయిందా? ఇలా కంప్లెంట్ చేస్తే మీ ఫోన్ మీకొస్తది

Lost cell phone? If you complaint like this, your phone will get

0
122

సౌత్ జోన్ పరిధిలో మిస్సింగ్ గురైన 66 స్మార్ట్ మొబైల్ ఫోన్లు రికవరీ చేశాం అని మీడియాకు తెలిపారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.

సెల్ ఫోన్లు రద్దీ ప్రాంతాల్లో అయ మార్కెట్ లలో మొబైల్ ఫోన్ లు మరిచి పోయినవి రికవరి చేశాం, సెల్ ఫోన్ మిస్ అయితే మూడు చోట్ల ఫిర్యాదు చేసుకోవచ్చు అని తెలిపారు.

1. పోలీస్ స్టేషన్ లో
2. హాక్ ఐ యాప్ లో
3. మీ సేవలో కూడా imei నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసుకుంటే ఖచ్చితంగా ట్రాకింగ్ పెట్టి పోయిన ఫోన్స్ వచ్చేలా చేస్తాము అన్నారు

అలా వచ్చిన ఫిర్యాదులలో 66 ఫోన్స్ రికవరీ చేశాము,పాతబస్తీ లోని అయ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్ లు లభించాయి.బహదూర్పురా లో 30 సెల్ ఫోన్లు, హుస్సేనీ ఆలం లో 15 , మాదన్నపేట్ లో తొమ్మిది , కమిటీ పుర లో 8 ,కలపట్టార్ లో 3,చార్మినార్ లో ఒక సెల్ ఫోన్ రికవరీ చేశాం అని వివరించారు.

మీ సేవలో మిస్సింగ్ డాక్యుమెంట్లు కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు, పిఎస్ కి వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు , మీ సేవలో అప్లై చేసిన వెంటనే కేసు దర్యాపు మొదలు పెడతాము అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.