తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అశ్వారావుపేట బస్టాండ్‌లో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రేమికులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషం తాగి బస్సు ఎక్కిన ఆ ప్రేమికులు కొద్ది దూరం వచ్చే సరికి ఇద్దరికి నురగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్‌కు సమాచారమిచ్చారు. దీంతో వారు అశ్వారావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో బస్సులో ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించేసరికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Flash News- ఆర్టీసీ బస్‌లో ప్రేమ జంట ఆత్మహత్య
Love couple commits suicide in RTC bus