ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెలినాలో రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో పెళ్లికి నిరాకరించారని.. ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి తలలు పగిలిపోయి గుర్తించలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలు ఉండటంతో వారిని గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.