వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంతేకాదు కొన్ని సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే ఆమె తన పేరెంట్స్ కి తమ ప్రేమ విషయం చెప్పింది. చివరకు తల్లిదండ్రులు అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. పది రోజుల సమయంలోనే ఓ ఉద్యోగస్తుడి సంబంధం తీసుకువచ్చారు. పేరెంట్స్ చెప్పిన పెళ్లి ఆమె చేసుకుంది.
ఇక భర్తతో సరిగ్గా ఉండలేకపోయింది. ఈ విషయం భర్తకు చెబితే ఏమవుతుందా అని బాధపడింది. చివరకు ఆమె భర్తకు ఈ విషయం చెప్పింది. అయితే భర్త ముందు కోప్పడినా తర్వాత ఆమె బాధ అర్దం చేసుకున్నాడు. నువ్వు నీ ప్రియుడ్ని ఇంటికి రమ్మని చెప్పు అన్నాడు. ఆ ప్రియుడు జైపూర్ వచ్చాడు. మీ ఇద్దరు ప్రేమించుకున్నారనే మాట నా భార్య ఇప్పుడు చెప్పింది. మీ ఇద్దరు ఇష్టంగా ఉంటే మీకు నేను పెళ్లి చేస్తా అని అతను చెప్పాడు.
ఇద్దరూ షాక్ అయ్యారు. అయితే అతను మాత్రం మా పేరెంట్స్ ఇలా పెళ్లి అయిన అమ్మాయితో పెళ్లికి ఒప్పకోరని, నేను ఇక ఆమెని పెళ్లి చేసుకోను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఇంతలా ప్రేమించిన ప్రియుడు ఇలా అనడంతో ఆమె షాక్ అయింది. అయితే ఆ భర్త మాత్రం ఈ విషయం జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో విషాదకరమైన ఘటనగా అందరూ బాధపడ్డారు.