ఇద్దరు మరదళ్లతో ప్రేమ – ఇద్దరితో ఒకేసారి పెళ్లి

Love with two Sister in Laws married at once

0
133

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి గురించి జనం తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే ఎందుకు ఇంత చర్చ అనుకుంటే. ఇక్కడ ఇద్దరు మరదళ్లను ప్రేమించి వారిని ఇద్దరిని ఒకేసారి బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.
అందుకే ఇప్పుడు అందరు అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు యువతులను పెళ్లాడాడు ఈ యువకుడు.

ఉట్నూర్ మండలం ఘనపూర్కు చెందిన అర్జున్, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఇక తన మేనత్త కూతురు ఉషారాణిని ప్రేమించాడు ఆమె అదే గ్రామంలో ఉంటుంది. ఇక మరో మనేత్త కూతురు పక్కగ్రామంలో ఉండే ఆమెతో కూడా ప్రేమాయణం నడిపాడు. మూడేళ్లుగా ఇద్దరు మరదళ్లతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించాడు అర్జున్.

నెల రోజుల కిందట ఇద్దరినీ ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మూడు ఫ్యామిలీలకి ఫైనల్ గా తన మాట చెప్పాడు. ఇక పెద్దలు అందరూ నిర్ణయించి ముగ్గురి నిర్ణయం అడిగి వివాహం జరిపించారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అతని వివాహం జరిగింది. అయితే అమ్మాయిలు ఇద్దరూ అతనే కావాలి అని కోరడంతో ఇద్దరిని వివాహం చేసుకున్నాడు.