ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంతలోనే దారుణం చేశాడు

Loved and married but meanwhile abused

0
91

కొందరు ప్రేమించి అవసరం తీరిన తర్వతా వారిని వదిలించుకుంటారు. పాపం వారిని ఎంతో నమ్మిన వారు మోసపోయామని కుమిలిపోతూ ఉంటారు. అయితే కొందరు చివరకు పోలీసుల దగ్గరకు వెళ్లి తమ బాధ తెలియచేస్తారు. ఇలాంటి ఘటనలు చాలా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఓ కసాయి దారుణం చేశాడు. చివరకు ప్రేమించిన భర్తే ఆమె పాలిట యమ పాశంగా మారి ప్రాణాలను హరించాడు.

యూపీలో దుర్గేష్ యాదవ్ అనే యువకుడు, దీపిక అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కుటుంబ సభ్యులకి తమ ప్రేమ విషయం చెప్పారు. పెద్దలు ఎవరూ ఒప్పుకోలేదు దీంతో ఇక దీపక అతనితో వచ్చేసింది ఇద్దరూ వివాహం చేసుకుని సొంతంగా కాపురం పెట్టుకున్నారు.

పెళ్లైన మొదట్లో దుర్గేష్ ప్రేమగా ఉన్నాడు. కాని రాను రాను ఆమెని మరింత వేధించాడు. చివరకు అర్ధరాత్రి పడుకున్న సమయంలో ఆమెపై కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు ఆమె తప్పించుకుంది. చివరకు ఇనుపరాడ్ తొ కొట్టాడు. ఆమె చనిపోయిన తర్వాత అక్కడ నుంచి దుర్గేష్ పరార్ అయ్యాడు. తర్వాతి రోజు దీపిక సోదరుడు బచ్చూలాల్ అక్కను చూసేందుకు ఇంటికి వచ్చాడు. కానీ అక్కడ అక్క శవమై కనిపించింది చివరకు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.