ప్రేమించి గర్భవతిని చేసి పారిపోయాడు 10 ఏళ్లకు తిరిగి వచ్చాడు చివరకు

Loved getting pregnant and ran away 10 years back

0
85

కొంతమంది కేటుగాళ్లు అమ్మాయిలని దారుణంగా మోసం చేస్తున్నారు. వారి మాయలో పడి చాలా మంది అమాయకమైన అమ్మాయిలు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఓ దుర్మార్గుడి మాయలో పడి ఓ యువతి మోసపోయింది.ప్రేమించిన వ్యక్తి చేతిలో గర్భవతి అయ్యింది. కానీ అతను ఈ విషయం తెలిసి పారిపోయాడు మళ్లీ పదేళ్లకు తిరిగి గ్రామానికి వచ్చాడు కాని చివరకు ఏమైందంటే.

ఛత్తీస్ ఘ‌డ్ లోని గరియాబంద్ ప్రాంతంలో భరత్ అనే వ్యక్తి ఉంటున్నాడు 2010లో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. 2011 లో ఆమె గర్భవతి అయింది ఈ విషయం అతనికి తెలిసి రాత్రికి రాత్రి ఆ ఊరు నుంచి పారిపోయాడు చివరకు వేరే ఊరిలో ఉన్నాడు ఆమెని అస్సలు పట్టించుకోలేదు ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

2013లో ఆ చిన్నారి మరణించింది. ఇక అతను అక్కడ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తున్నాడు.పదేళ్ల తర్వాత ఈ నెల 10న గరియాబంద్ లో అడుగు పెట్టాడు. భరత్ వచ్చినట్టు తెలుసుకున్న బాధిత యువతి అతడి ఇంటికి వెళ్లింది. పెళ్లి చేసుకోమ‌ని అడిగింది. కానీ అతను దానికి ఒప్పుకోలేదు దీంతో ఆమె పోలీసులని ఆశ్రయించింది. చివరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.